Gold Price:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు

దసరా పండగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. అందరూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఒక విషయం మాత్రం జనాలకు షాక్ ఇస్తోంది. అదే అందరికీ ప్రియమైన బంగారం. కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

New Update
Gold Price:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు

Gold Price Today: పండుగలు, శుభకార్యాలు అంటే భారతీయులు బంగారం కొనుగోలు చేస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అది ఎంత మాత్రం వీలు అయ్యేలా కనిపించడం లేదు. గత నాలుగు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గోల్డ్ రేట్స్ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ (Hyderabad) లో ఈరోజు ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 5,660 గా ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 45,280 గా ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 56,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ 10 గ్రాముల ధర రూ. 200 పెరిగింది.

Also Read:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ

ఇక 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే.. హైదరాబాద్ లో ఒక గ్రాము ధర రూ. 6,175 గానూ, 8 గ్రాముల బంగారం ధర రూ. 49,400 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 61,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగింది.

బంగారంతో పాటూ వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఒక గ్రాము వెండి ధర రూ. 78.70 గానూ, 8 గ్రాముల వెండి ధర రూ. 629.60 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 787 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ కిలో వెండి ధర రూ. 1,200 పెరిగింది.

Also Read:వెయిట్ లాస్ కోసం టేస్టీ స్మూతీలు…

Advertisment
తాజా కథనాలు