Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.

పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

New Update
Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.

ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు నిరాఘాటంగా సాగుతున్నాయి. నాల్గవరోజు సెషన్స్ లో భాగంగా నిన్న లోక్ సభలో అమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఈరోజు రాజ్యసభలో చర్చకు ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలే ఇవాళ కూడా బిల్లును రాజ్యసభలో చదివారు. దీని తర్వాత రాజ్యసభ మెంబర్లు, ఎంపీలు బిల్లు మీద చర్చను ప్రారంభించారు.

ఇప్పటికే మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలోనూ చర్చ పూర్తయిన తర్వాత ఓటింగ్ ద్వారా బిల్లును ఆమోదించనున్నారు. అయితే రెండు సభల్లోనూ మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ అమలు అయ్యేది మాత్రం 2027 తర్వాతనే అని కేంద్రం స్పష్టం చేసింది. 2024 ఎన్నికల తర్వాతనే జనగణన, డీలిమిటేషన్ జరుగుతాయని... వీలయినంత తొందరగా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు నాల్గవ రోజు సెషన్స్ లోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు పాసవ్వడం ఒక చారిత్రక ఘట్టమని అన్నారు. ఈ బిల్లు భారతీయ మహిళల్లో ఉత్సాహం నింపిందని చెప్పుకొచ్చారు. బిల్లును ఆమోదించిన ప్రతీ ఞక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నారీ గతి శక్తిని మార్చడానికి ఇప్పుడు చివరి మెట్టు మీద ఉన్నామని మోదీ అన్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితే దాన్ని కూడా దాటేస్తామని చెప్పారు. దేశం కొత్త శిఖరాలకు చేరుకునేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు తోడ్పడుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ ప్రసంగం తర్వాత లోక్ సభలో చంద్రయాన్-3 మీద చర్చ జరుగుతోంది.

ఇక బీజెపీ ఎంపీ హేమమాలినీ మాట్లాడుతూ ప్రధాని మోదీకి ఒక విజన్ ఉంది...దానితోనే గొప్ప పనులు చేస్తున్నారని ఆమె కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఏం జరిగిందన్నది కాదు ముఖ్యం ప్రస్తుతం మోదీ బిల్లును తీసుకురావడమే కాకుండా దాన్ని పాస్ కూడా చేయించారని హేమమాలిని అన్నారు.

Advertisment
తాజా కథనాలు