Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
మహిళలకు ఏయే సీట్లు రిజర్వ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు? మహిళా రిజర్వేషన్ ఎప్పటి వరుకు ఉంటుంది? SC-ST మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా? లాంటి ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానలు చెబుతున్నారు నిపుణులు. ఈ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కేటాయింపు లేదంటున్నారు. ఒక్కసారి లోక్సభ, అసెంబ్లీల్లో ఈ చట్టం అమల్లోకి వస్తే 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుందంటున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా చారిత్రక సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంట్ హౌస్కు చేరుకున్నప్పుడు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేకరులు అడిగన ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ కీలక బిల్లును ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక సెషన్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సమావేశం ఆసక్తిని రేకెత్తించింది.