Padala Aruna joined Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత ‘వారాహి విజయ యాత్ర’లో భాగంగా విశాఖ పట్నంకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు కారణంగా.. జనసేన పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అటు ఉంచితే.. జనసేన పార్టీలో జోష్ నెలకొంది. మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. పార్టీలో చేరిన మాజీ మంత్రి
మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్. ఈ సందర్భంగా జనసేన చీఫ్ మాట్లాడుతూ.. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని పవన్ గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు. మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని.. తాను స్వాగతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
Translate this News: