హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జగన్ ఆశీస్సులతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా. ఆర్టీవీతో ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడుతూ.. తానెవరికీ ద్రోహం చేయలేదని పేర్కొన్నారు. నా దరిద్రం అంటే ఇదేనని.. కావాలనే అసంతృప్తి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.
జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల కేటాయించడంపై హరిరామజోగయ్య లేఖ రాశారు. ఏ ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర జనసేనాని చేయిచాచడం ఏంటన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని పేర్కొన్నారు.
24 సీట్లు తీసుకున్న పవన్ ఎలా సీఎం అవుతాడని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసు.. గోల్డ్ కవరింగ్ ఇస్తున్నారంటూ కౌంటర్ వేశారు. మళ్ళీ అధికారం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 20 సీట్లపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 32 సీట్లు అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.
గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ వేడుకలో కళాకారులు, RTV యాజమాన్యం నివాళులు అర్పించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గద్దర్ కు నివాళులు అర్పిస్తూ ప్రకటన విడుదల చేసారు.
టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించకూడదన్నారు. సర్దుబాటుకు ముందే అభ్యర్ధుల్ని ప్రకటించడం సరికాదని సూచించారు.