France - India : సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. నాలుగు రోజులుగా ఫ్రాన్స్(France) లో చిక్కుకున్న భారతీయులు(Indians) ఈరోజు ఇండియాకు చేరుకున్నారు. మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం రొమేనియన్ ఎయిర్ సర్వీసెస్(RAS Romanian Airport Services) కు సంబంధించిన విమానాన్ని ఫ్రాన్ లో ఆపేశారు. ఇన్ని రోజులుగా భారతీయులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాలుగు రోజుల విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో 276 మంది ప్రయాణికులు ఈరోజు తెల్లవారుఝామున ముంబైకి చేరుకున్నారు. అయితే ఇంకా 25 మంది మాత్రం ఫ్రాన్స్ లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దవాళ్ళు, 5గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళ పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతో పంపలేదని అధికారులు చెబుతున్నారు. వీళ్ళను శరణార్ధులుగా పరిగణమిస్తామని..ఫ్రాన్స్ చట్టాల ప్రకారం వాళ్ళని వెనక్కు పంపడం కుదరదని తెలిపారు.
Also Read:లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు
రొమేనియా విమానంలో మొత్తం 303మంది భారతీయులు ఇండియాకు వస్తున్నారు. ఇందులో 11 మంది మైనర్లు ఎవరి సహాయం లేకుండా వస్తున్నారు. వీళ్ళల్లో 6గురిని వెనక్కు పంపించేశారు కానీ 5గురిని మాత్రం అక్కడే ఉంచేశారు. వీళ్ళను తరలిస్తున్న ఇద్దరు ఏజెన్సీ వ్యక్తులను కూడా ఫ్రాన్స్ ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీని మీద అధికారికంగా మాత్రం ఇరుదేశాల నుంచి ప్రకటన రాలేదు.
రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం దుబాయి(Dubai) నుంచి నికరాగ్వాకు వెళుతూ మార్గమధ్యంలో ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో దింపినప్పుడు ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే నిలువరించారు. నికరాగ్వా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాన్స్ అధికారులు విమానంలోని భారతీయులను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో కొందరు ఫ్రాన్స్ ఆశ్రయం కోరగా మిగతా వారు భారత్‌లో దిగారు.