France Flight : హమ్మయ్య ఫ్రాన్స్ నుంచి వాళ్ళు వచ్చేశారు..25 మంది మాత్రం ఇంకా అక్కడే ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయులు ఎట్టకేలకు ఇండియా చేరుకున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న రుమేనియా విమానం ఈరోజు తెల్లవారు ఝామున మంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో 25 మంది తప్ప అందరూ స్వదేశానికి చేరుకున్నారు. By Manogna alamuru 26 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి France - India : సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. నాలుగు రోజులుగా ఫ్రాన్స్(France) లో చిక్కుకున్న భారతీయులు(Indians) ఈరోజు ఇండియాకు చేరుకున్నారు. మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం రొమేనియన్ ఎయిర్ సర్వీసెస్(RAS Romanian Airport Services) కు సంబంధించిన విమానాన్ని ఫ్రాన్ లో ఆపేశారు. ఇన్ని రోజులుగా భారతీయులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాలుగు రోజుల విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో 276 మంది ప్రయాణికులు ఈరోజు తెల్లవారుఝామున ముంబైకి చేరుకున్నారు. అయితే ఇంకా 25 మంది మాత్రం ఫ్రాన్స్ లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దవాళ్ళు, 5గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళ పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతో పంపలేదని అధికారులు చెబుతున్నారు. వీళ్ళను శరణార్ధులుగా పరిగణమిస్తామని..ఫ్రాన్స్ చట్టాల ప్రకారం వాళ్ళని వెనక్కు పంపడం కుదరదని తెలిపారు. #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx — ANI (@ANI) December 26, 2023 Also Read:లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు రొమేనియా విమానంలో మొత్తం 303మంది భారతీయులు ఇండియాకు వస్తున్నారు. ఇందులో 11 మంది మైనర్లు ఎవరి సహాయం లేకుండా వస్తున్నారు. వీళ్ళల్లో 6గురిని వెనక్కు పంపించేశారు కానీ 5గురిని మాత్రం అక్కడే ఉంచేశారు. వీళ్ళను తరలిస్తున్న ఇద్దరు ఏజెన్సీ వ్యక్తులను కూడా ఫ్రాన్స్ ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీని మీద అధికారికంగా మాత్రం ఇరుదేశాల నుంచి ప్రకటన రాలేదు. Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN — ANI (@ANI) December 26, 2023 రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం దుబాయి(Dubai) నుంచి నికరాగ్వాకు వెళుతూ మార్గమధ్యంలో ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో దింపినప్పుడు ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే నిలువరించారు. నికరాగ్వా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాన్స్ అధికారులు విమానంలోని భారతీయులను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో కొందరు ఫ్రాన్స్ ఆశ్రయం కోరగా మిగతా వారు భారత్‌లో దిగారు. #flight #passengers #india #france #in-mumbai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి