Mahadev Betting App Scam : ఇటీవల మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే కుంభకోణంలో కీలక నిందితుడైన తండ్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం చర్చనీయాంశమైంది. దుర్గ్ జిల్లాలోని అచ్చోటి అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహదేవ్ యాప్ కుంభకోణంలో అసిమ్ దాస్ అనే వ్యక్తి కీలక నిందితుడుగా ఉన్నాడు. అతని తండ్రి సుశీల్ దాస్ (62) ఆచూకీ గత రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. ఎంత వెతికినా ఆయన జాడ లేదు. అయితే చివరకి సుశిల్ దాస్ మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామంలోని ఓ బావిలో గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుశీల్ దాస్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also read: నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్
ప్రస్తుతం మృతి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సుశీల్‌దాస్ ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు ఆసిమ్ దాస్, కానిస్టేబుల్ భీమ్ సింగ్‌ను మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో భాగంగా నవంబర్ 3న ఈడీ అరెస్టు చేసింది. అలాగే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈ కేసులో అరెస్టైన కొరియర్ ముందుగా తన వాంగ్ములంలో ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలిపింది. అయితే కొరియర్ మళ్లీ తన మార్చడంతో ఎన్నికలకు ముందు ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. ఇదిలా ఉండగా.. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ పెళ్లి ఈ ఏడాది యూఏఈలో జరిగింది. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే బాలివుడ్ సెలబ్రిటీ (Bollywood Celebrity)లను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది.
Also read: ఈ స్కీమ్ తో ఉద్యోగులకే కాదు…సామాన్యులకూ ఎన్నో బెనిఫిట్స్…పూర్తి వివరాలివే..!!