మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం.. ఒకరు అనుమానస్పద మృతి
ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడైన అసిమ్ దాస్ తండ్రి సుశీల్ దాస్ (62) అనుమానస్పదంగా మృతి చెందారు. మంగళవారం తన స్వగ్రామంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.