/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2-5.jpg)
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY)లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డిప్లొమా ఇన్ యోగిక్ సైన్సెస్ (DYSc) విభాగానికి చెందిన కొత్త విద్యార్థుల కోసం స్వాగత వేడుకను జరిపారు. ఈ సందర్భంగా యోగా, ఆయుర్వేద నిపుణులు.. యోగా రంగంలో టీచర్ల పాత్ర ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA) వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. సంజీవ్ శర్మ, అలాగే డీన్, ఐటీ ఇంఛార్జ్ ప్రొ. సుదీప్త ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక MDNIY డైరెక్టర్ డా. కాశీనాథ్ సంగండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు తీసుకున్నారు.
Also Read: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి!
ఈ వేడుకలో ప్రొ. సంజీవ్ శర్మ.. మన జీవితాల్లో కనిపించే గురువుల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. '' మనకు గురుకుల సంప్రదాయం ఉంది. ఇక్కడ గురువులు కేవలం సబ్జెక్టులను మాత్రమే కాదు.. జీవితాల గురించి కూడా బోధిస్తారు. టీచర్లు తమ హృదయాల ద్వారా విద్యార్థుల మనసుల్లోకి ప్రవేశిస్తారు. మనం టీచర్లుగా అలాగే విద్యార్థులుగా కూడా ఉండాలి. దీనివల్ల మనం నేర్చుకునే విధానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. భారత్ ఆధ్యాత్మికతకు నిలయం. ఈ ఇన్‌స్టిట్యూట్‌శక్తి అపూర్వమైనది. ఈ సమాజం, దేశం, ప్రపంచంలో మెరుగైన పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భగా MDNIY వహించిన పాత్ర అమోఘమని'' సంజీవ్ శర్మ అన్నారు.
మరోవైపు డా. కాశీనాథ్ సంగండి మాట్లాడుతూ మొరార్జీ దేశాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా సాధించిన విజయాలను కొనియాడారు. ''ఈ ఏడాది అన్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (గుండె జబ్బులు, శ్వాసకోస వ్యాధులు, షుగర్,క్యాన్సర్ లాంటి వ్యాధులు) ల కోసం మాడ్యూల్స్‌ను సిద్ధం చేయబోతున్నాం. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించనుందని'' తెలిపారు. ఇక ప్రొ. సుదీప్త్ రాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి తప్పుల నుంచి నేర్చుకొనే ప్రాముఖ్యతను వివరించారు. మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్‌ను ప్రఖ్యాత యోగా గురువుగా అభివర్ణించారు. యోగా చైతన్యానికి దారితీస్తుందని సర్వేపల్లి రాధాకృష్ణన్ నమ్మారని, యోగా ఫిలాసఫీలో ఇదొక కీలక సూత్రమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ రాణిస్తున్న ఈ యోగా ఫిలాసఫీని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు యోగా టీచర్లు పాల్గొన్నారు.
Also read: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పాఠశాలలకు ఉచిత కరెంట్!
शिक्षक दिवस के पावन अवसर पर आज मो.दे.रा.यो.सं. के प्रेक्षागृह में डीवाईएससी के नवागंतुक छात्र-छात्राओं के स्वागत समारोह का आयोजन किया गया,जिसमें प्रो. संजीव शर्मा, कुलपति, एन.आई.ए. डीम्ड यूनिवर्सिटी, आयुष मंत्रालय, भारत सरकार, जयपुर ने मुख्य अतिथि और प्रो. सुदीप्त रथ, डीन… pic.twitter.com/SbnBlUIWhe
— Morarji Desai National Institute of Yoga (MDNIY) (@mdniy) September 5, 2024
A day to thank, a day to celebrate!
Glimpses of Teachers' Day celebration at MDNIY✨#TeachersDay #MDNIY #StudentAppreciation #Gratitude #ThankYouTeachers #GuruShishyaParampara #RespectForTeachers #TeachersMatter #Education #Learning #StudentsLoveTeachers #HeartfeltMessages… pic.twitter.com/jhrLcoKjn6
— Morarji Desai National Institute of Yoga (MDNIY) (@mdniy) September 5, 2024