Former MP Vinod Kumar: కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీపై విమర్శల దాడి చేశారు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఎంపీ బండి సంజయ్ లు (MP Bandi Sanjay) తెలంగాణ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పై పచ్చి అబద్దాలు మాట్లాడి అబాండాలు వేసి విష ప్రచారం చేశారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన విష ప్రచారాలను తిప్పి కొట్టలేకపోయామని పేర్కొన్నారు.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవనంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టించి ఇచ్చామని తాను విలేకరుల సమావేశంలో మాట్లాడితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన మాటలను తప్పుబడుతూ తెలంగాణలో ఒకటో తారీకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారని అన్నారు. బండి సంజయ్ మాటలకు తాను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. దేశంలోని మోదీనాయకత్వంలో ఉన్న ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం గా..ఆర్.బి.ఐ నివేదిక ప్రకారం సొంత పన్ను వసూల్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని... SOTR (State Own Tax Revenue )సొంత పన్నుల రాబడులు 84.2 % నిర్ణయించబడిందని అన్నారు. దేశంలో హర్యానా 86.9% తర్వాత రెండో రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో మార్చి వరకు 3.89,675 అప్పులు చూపించామని వెల్లడించారు.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు సొంత పన్నులు వసూళ్లలో తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవని అన్నారు. భారతదేశంలో తెలంగాణ కంటే మరో 26 రాష్ట్రాలు అప్పుల్లో తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని పదేపదే విష ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన సంపద గురించి వాళ్లు మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు.