KTR: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టాడని మండిపడ్డారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఈ నెల 13న మాజీ సీఎం అధ్యక్షతన జరగబోయే ఛలో నల్గొండ సభ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మీద పగ పట్టిందని అన్నారు.
ALSO READ: అదే 23న.. చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన ట్వీట్
తమ శాసన సభ్యులు GHMC జనరల్ బాడీ మీటింగ్ కు హాజరై నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad) పరిధి లో తమకు ఏక పక్ష తీర్పు ఇచ్చిందని అన్నారు. పార్టీ మారే వారిని ఉద్దేశించి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మ హత్యలే ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ లోకి వెళ్తే వారి కర్మ అంటూ కాంగ్రెస్ (Congress) చేరాలనుకునే వారిపై పరోక్షంగా హెచ్చరించారు.
మేడిగడ్డ కట్టిందే కేసీఆర్..
మేడిగడ్డ (Medigadda Project) కట్టిందే కేసీఆర్ (KCR) అని అన్నారు కేటీఆర్. కాళేశ్వరం లో కాంగ్రెస్ వాళ్లకు ఓనమాలు కూడా తెలవదు అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని అన్నారు. కాళేశ్వరం కట్టిందే మేమని.. కాళేశ్వరం గురించి ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు అని అన్నారు. బట్ట కాల్చి మీద పడేయడం కాంగ్రెస్ కు అలవాటు అంటూ ధ్వజమెత్తారు. అందులో లోపాలు ఏమైనా ఉంటే సవరించొచ్చు అని అన్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నట్లు అనుకోవట్లేదు ఇంకా తాము అధికారం లో ఉన్నాం అనుకుంటున్నారని చురకలు అంటించారు.
ఓటు కు నోటు లో దొరికిన దొంగ..
ఐఏఎస్ లు తప్పు చేస్తే చర్యలు తీసుకోండి అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయనే ఓ క్రిమినల్ ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు. ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలంటే నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు అని అన్నారు.
ALSO READ: కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?
DO WATCH: