Telangana: కాంగ్రెస్ అధికారంలోనే భారీ అక్రమాలు జరిగాయి..ఈటల సంచలన కామెంట్స్! తెలంగాణలో బీజేపీ 10కిపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. విజయసంకల్ప యాత్రలో భాగంగా గజ్వేల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ అధికారంలోనే 2జి స్పెక్ట్రమ్, కోల్ మైన్, ఫెర్టిలైజర్ స్కామ్స్ జరిగాయని విమర్శించారు. By srinivas 26 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Etela Rajender: ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 10కిపైగా సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ (Medak) పార్లమెంట్ పరిధిలో విజయసంకల్ప యాత్ర (Vijay Sankalp Yatra) సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈటల రాజేందర్. ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా కొట్లాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గుంజుకున్న భూములు వెనక్కు ఇవ్వాలి.. అలాగే ఈ నెల 20 నుంచి 5 క్లస్టర్స్ లో విజయసంకల్ప యాత్ర చేస్తున్నమని తెలిపారు. జహీరాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో యాత్ర కొనసాగుతుంది. యాత్రలో మాకు అనేక ధరఖాస్తులు వస్తున్నాయి. మా భూములు ప్రాజెక్టులు కోసం, రోడ్ల కోసం గుంజుకుంటే భరించాం. కాని ప్రైవేట్ వ్యక్తులకోసం కోసం గుంజుకున్న భూములు వెనక్కు ఇవ్వాలని ఆందోళన కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం ఆ భూములు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవన్ని జన్యూన్ డిమాండ్స్.. ఇక గజ్వేల్ లో అనేక హామీలు ఇచ్చిన ఈటల.. ఎన్నికల్లో (Telangana Elections) గెలవగానే లక్ష అదనంగా భూభాదితులకు ఇస్తామన్నారు. 18 సంవత్సరాల వయసు పైబడిన భూములు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇళ్లకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అంటూ అనేక హామీలు ఇచ్చారు. ఇక గత పార్టీలు ఓట్లు డబ్బాల పడే వరకు హామీలు ఇచ్చి, వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఓడిపోవచ్చు.. కానీ ఇవన్ని జన్యూన్ డిమాండ్స్ కాబట్టి వాటిని నెవర్చాలని నేనే ఈ ప్రభుత్వానికి దరఖాస్తు ఇస్తానన్నారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేశాం. కానీ ఈ సారి జెండాలు లేవు మోడీ (PM Modi) గారికే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఆత్మగౌరవం.. ఇక ప్రధాని మోడీ గారు మహిళలకు ఆత్మగౌరవం పెంచే విధంగా టాయిలెట్స్ కట్టించాడని, మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి మా గౌరవం పెంచారని కొనియాడారు. రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మించి లైన్లలో నిలబడే బాధలేకుండా ఎరువులు అందించారు. కేంద్రం ఇచ్చే రైతుబంధు టెంచన్ గా పడుతుంది. 10 లక్షల రూపాయల వరకు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించబోతున్నారు. అంతేకాదు ఈ దేశంలో సుభిక్షంగా, సురక్షితంగా బ్రతకాలి అనే మోదీ గారికి ఓటు వేయాలని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!? కాంగ్రెస్ హయాంలోనే అనేక అక్రమాలు.. గతంలో కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉంటే అనేక అక్రమాలు జరిగాయి. 2జి స్పెక్ట్రమ్ స్కాం, కోల్ మైన్ స్కాం, ఫెర్టిలైజర్ స్కాం.. ఇలా అనేక స్కామ్ లలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయ్యు జైల్లో ఉన్నారు. కానీ మోడీ గారి హయాంలో ఎక్కడా ఒక్క స్కామ్ లేదు. మొదటి సారి 273 సీట్లతో గెలిస్తే, రెండవ సారి 303 సీట్లతో బీజేపీ ని గెలిపించారు. 370 రద్దు (Article 370), రామాలయ నిర్మాణం, మైనారిటీ మహిళలకు వరమైన ట్రిపుల్ తలాక్ (Triple Talaq) రద్దులాంటి ఎన్నో తీసుకువచ్చారు. సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ ను నిబద్ధతగా అమలు చేస్తున్నారు. అందుకే మోడీ గారికి దేశంలో అన్ని వర్గాల అన్ని రకాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఆపి విద్యార్థులను తీసుకువచ్చిన ఘనత మోడీ గారిది.మన సైనికుడు అభినందన్ పాకిస్థాన్ లో చిక్కుపడితే అల్టిమేటం ఇచ్చి తీసుకువచ్చి భారత జాతి ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ. మన నావీ ఆఫీసర్స్ కి శిక్ష పడితే దౌత్యపరమైన చర్చ జరిపి తీసుకువచ్చారు. ఒకప్పుడు భారత్ వేరు ఇప్పుడు వేరు. కరోనా కష్టకాలంలో అమెరికాకు, ప్రపంచానికి వాక్సిన్ అందించారంటూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. మోసపు హామీలు నమ్మవద్దు.. ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి, నేషనల్ హై వేస్, విమానాశ్రయాల నిర్మాణం ఎందులో అయినా బ్రహ్మాండమైన అభివృద్ధి ఉందని, మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి భారత దేశం వికసించాలని తాము యాత్ర చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలారా మోసపు హామీలు నమ్మవద్దు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదు. ప్రతి మహిళకు రూ. 2500, రైతుబంధు రూ.15000 కౌలు రైతులకు రూ.12 వేలు,ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు, మహిళలకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏదీ అమలు కాలేదు. ధరకాస్తుల పేరుతో మళ్ళీ మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఖతం అయిన పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీనీ గెలిపించి నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుతున్నాని ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. #modi #telangana-elections #brs #gajwel #vijay-sankalp-yatra #etela-rajender #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి