Carrying Beef : మహారాష్ట్రం (Maharashtra) లో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ రైల్లో ప్రయాణిస్తున్న వృద్ధుడు.. బీఫ్ (Beef) (గోమాంసం) తీసుకెళ్తున్నాడనే అనుమానంతో తోటి ప్రయాణికులు ఆయన్ని కొట్టారు. బూతులు తిడుతూ అవమానించారు. అక్కడున్న వాళ్లు కూడా ఆ వృద్ధుడిని చూసి నవ్వుతున్నారే తప్ప.. ఎవరూ కూడా ఆయనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జలగావ్ అనే జిల్లాలో అశ్రీఫ్ మున్యార్ అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. అతడు మాలిగావ్ ఉంటున్న తన కూతురుని చూసేందుకు ధులే ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. తనతో పాటు రెండు ప్లాస్టిక్ బాటిళ్లు వెంట తీసుకెళ్లాడు.
Also Read: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. మహిళలే టార్గెట్‌గా!
రైలు ప్రయాణం (Train Journey) సాగుతున్న సమయంలో మున్యార్‌తో పాటు ప్రయాణిస్తున్న తోటి యువకులు ఆ బాక్సుల్లో ఉంది ఏంటని ప్రశ్నించారు. అతను మేక మాంసంమని చెప్పాడు. కానీ ఆ యువకులకు అది నమ్మశక్యంగా అనిపించలేదు. మళ్లీ అడుగుతూనే ఉన్నారు. బూతులు తిడుతూ బెదిరించారు. ఆ వృద్ధుడు అందులో ఉంది బర్రె మాంసమని చెప్పాడు. అయినప్పటికీ ఆ యువకులు అతడిని కొట్టారు. బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం జీఆర్పీ పోలీసులు దృష్టికి రావడంతో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు. నిందుతుల్లో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర జంతు సంరక్షణ చట్టం 1976 ప్రకారం, ఆవులు, ఎద్దులను చంపడం నిషేధం. కానీ బర్రెలు ఈ నిషేధం కిందకి రావు.
Also read: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు