Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. మహిళలే టార్గెట్‌గా! బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ ఉపాధ్యాయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 49 మంది టీచర్లతో బలవంతంగా రాజీమానా చేయించారు నిరసనకారులు. హిందూ మహిళలను వేధిస్తున్నారు. దేవాలయాలు, వ్యాపారాలను ద్వంసం చేస్తున్నారు. By srinivas 01 Sep 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇంకా అలర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానంపై మొదలైన నిరసనల్లో హిందూ ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే దాడులకు బయపడి 49 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. మరికొంతమందిని బలవంతంగా రాజానామాలు చేయిస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల రాజీనామాలపై స్పందించిన ప్రస్తుత ప్రభుత్వం వారితో చర్చలు జరిపి తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంటోంది. 49 మందిలో కేవలం 19 మంది ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లో చేరారు. హిందూ దేవాలయాలు, వ్యాపారాలు ద్వంసం.. బరిషల్‌లోని బకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆమెను బలవంతంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా ఖాళీ కాగితంపై రాజీనామా చేస్తున్నట్లు రాయించుకున్నారు. అలాగే అజింపూర్ గవర్నమెంట్ స్కూల్, కాలేజీలకు చెందిన 50 మంది బాలికలతోపాటు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. ఇదిలా ఉంటే హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలు, గృహాలు, వ్యాపారాలను ద్వంసం చేస్తున్నారు. #students-attack #hindus-and-hindu-teachers #bangladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి