Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్

అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండగా.. కేజ్రీవాల్‌కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ ఈరోజు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.

New Update
Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్

ED to File Chargesheet: ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. లోక్‌సభ ఎన్నికల వేళ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఆయన బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రవాల్‌పై బెయిల్‌పై (Kejriwal Bail) ఇప్పటికే కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును జస్టీస్ సంజీవ్‌ ఖన్నా, జస్టీస్ దీపాంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజుకి రిజర్వ్ చేసింది. అయితే నేడు తీర్పు ఇవ్వనుండగా.. కేజ్రీవాల్‌కు ఈడీ మరో షాక్ ఇచ్చింది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ రేపు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌గా ఉన్నట్లు తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో మార్చి 21న అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్.. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇదిలాఉండగా.. ఆయనకు బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని.. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై ఈడీ (ED) డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై  సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్‌

Advertisment
తాజా కథనాలు