Cancellation Of Election Code : తెలంగాణ (Telangana)తో సహా రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC).. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న షెడ్యూల్ వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 3న ఎన్నికల ప్రకటన జారీ అయ్యింది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత 13వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఇక చివరికి 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు పూర్తైంది. తెలంగాణతో సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా అదే రోజు ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఫలితాలు వెల్లడి కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఎత్తివేత తక్షిణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే మిజోరాంలో మాత్రం డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి.
Also Read: ఓటమి తరువాత కేసీఆర్.. ఏం చేశారంటే?
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) విజయం సాధించగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక మిజోరాంలో పీపుల్ మూవ్‌మెంట్(జడ్‌పీఎం) పార్టీ గెలిచింది. అయితే వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి.
Also read: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. 13 మంది మృతి