Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ నాలుగేళ్ళగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖా మంత్రి బొత్స సత్తిబాబు తెలిపారు. పోస్టుల సంఖ్య ఎంతనేది కూడా త్వరలోనే చెబుతామని అన్నారు. By Manogna alamuru 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి DSC Notification : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) కోసం తెగ ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు వైసీపీ(YCP) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి(Sankranti) పండగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తెలిపారు. సంక్రాంతి కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. డీఎస్సీ గురించి ఇప్పటికే సీఎం జగన్(CM Jagan) తో చర్చించామని, పోస్టుల సంఖ్య ఎంత అనేది త్వరలోనే తెలియజేస్తామని మంత్రి చెప్పారు. ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను కూడా త్వరలోనే తెలియజేస్తామని బొత్స తెలిపారు. Also Read:అయోధ్య ప్రారంభోత్సవాన అతిథులకు అపూర్వ కానుక ఏపీలో డీఎస్సీ నోటిషికేషన్ కోసం అక్కడి నిరుద్యోగులు(Un-Employees) నాలుగేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి గత ఏప్రిల్ నుంచి డీఎస్సీ నోటిషికేషన్ విడుద అవ్వాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ఇదిగో, అదిగో అంటూ వచ్చింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో ప్రకటన వెలువడే అవకాశముందని మంత్రి బొత్స గత జులైలో ప్రకటన చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతోందని అన్నారు. కానీ అదేమీ జరగలేదు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ఈసారి అయినా ఈ వార్త నిజమేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేస్తే మా కష్టాలు తీరతాయిని అంటున్నారు. మరోవైపు పాఠశాలల రేషనలైజేషన్‌తో ఏపీలో స్కూల్స్ సంఖ్య తగ్గి ఉపాధ్యాయుల సగటు సంఖ్య పెరిగింది. ఒక్క టీచరే ఉన్న స్కూళ్ళు కూడా పెద్ద స్కూల్స్‌లో విలీనమయ్యాయి. భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవకాశం లేకుండా ఈ పని చేశారంటూ విమర్శలు వినిపించాయి. ఈ దశలో అసలు ఖాళీలెన్ని..? వాటిలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సినవి ఎన్ని..? అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, వ్యాయమ ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి. Also Read:ఒక మెదడు…ఎనిమిది చేతుల వింత జీవి గురించి మీకు తెలుసా.. #andhra-pradesh #jobs #dsc-notification #makar-sankranti #andhra-pradesh-minister-botsa-satya-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి