Crime: ప్రాణాలు తీసిన ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ చాట్..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో వాట్సాప్‌ గ్రూప్‌లోని కొన్ని మెసేజ్‌ల వల్ల మొదలైన వివాదం.. ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్లింది. ఓ ఫ్యామిలీ గ్రూప్‌లో బంధువుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో అస్లాం అనే వ్యక్తి తన బంధువైన సల్మాన్ అన్సారీని కత్తితో పొడిచి చంపేశాడు.

New Update
Crime: ప్రాణాలు తీసిన ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ చాట్..

ఈరోజుల్లో సోషల్ మీడియా వాడటం అనేది మన రోజువారి జీవితంలో భాగం అయిపోయింది. ప్రతిరోజూ కనీసం మూడు నాలుగు గంటల పాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి యాప్స్‌లో మునిగిపోతున్నారు. అయితే రాజస్థాన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వాట్సాప్‌ గ్రూప్‌లోని కొన్ని మెసేజ్‌లు వల్ల మొదలైన వివాదం.. ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్లింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌లోని సల్మాన్ అన్సారీ కుటుంబ సభ్యులు 'ఖాన్‌ ఫ్యామిలీ' అనే పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. కొన్ని రోజులగా సల్మాన్‌ బంధువులు అస్లాం, జమీల్‌, సాహిల్ సల్మాన్‌కు వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడుతున్నారు.

Also Read: వారణాసిలో మోదీ నామినేషన్-LIVE

దీంతో ఆ బంధువుల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం అర్ధాత్రి సల్మాన్.. తన కుటుంబ సభ్యులను శాంతింపజేయడడానికి తన స్నేహితులో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూప్‌లో ఒక మెసేజ్‌పై వాగ్వాదం చోటు చేసుకుంది. అది పెద్ద గొడవగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో అస్లాం.. కత్తి తీసి సల్మాన్ ఛాతిపై పొడిచాడు. సల్మాన్ కాపాడేందుకు యత్నించిన అతడి స్నేహితుడు షారుఖ్‌ను కూడా కడుపులో పొడిచారు. ఆ తర్వాత అక్కడ నుంచి అస్లాం పారిపోయాడు. ఈ సంఘటన ఓ బార్బర్ షాపులో జరిగింది.

ఛాతిలో కత్తి దాడికి గురైన సల్మాన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ షారుఖ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు అస్లాం కోసం గాలిస్తున్నారు.

Also Read: ఈసారి ముందుగానే రానున్న రుతుపవనాలు

#telugu-news #murder #social-media #whatsapp #whatsapp-group
Advertisment
Advertisment
తాజా కథనాలు