Kerala : 'నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు'.. కేరళ ఎంపీ సంచలన కామెంట్స్

కేరళలో మొదటిసారిగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సురేష్ గోపీ నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకి మంత్రి పదవిపై ఆశ లేదని, త్వరలోనే ఆ పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉందని తాజాగా చెప్పుకొచ్చారు. ఎంపీగా ఉంటూనే కేరళలో సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Kerala : 'నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు'.. కేరళ ఎంపీ సంచలన కామెంట్స్
New Update

Union Minister Suresh Gopi : ఢిల్లీ (Delhi) లోని రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan) లో ఆదివారం ప్రధాని మోదీ (PM Modi) ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనతో పాటు మొత్తం 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేరళకు చెందిన నటుడు, బీజేపీ నేత సురేష్‌ గోపి (Suresh Gopi) కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే మంత్రివర్గం నుంచి వైదొలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అవ్వాలనే ఆశ తనకు లేదని.. కేరళలో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కేంద్రమంత్రి పదవిలో ఉండటం కన్నా ఎంపీగానే ఉండి తాను ఎక్కువగా సాధించగలనని పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒక్క రోజులోనే ఆయన ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.

Also read: యూపీలో బీజేపీ ఘోర పరాజయం.. యోగీని మారుస్తారా

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సురేష్ గోపీ.. తిస్సూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అంతేకాదు కేరళలో మొదటిసారిగా బీజేపీ నుంచి గెలిచిన ఒకేఒక్క ఎంపీగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన.. మోదీ గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారు. ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు రావడమే.. ఎంపీగా గెలుపొందేలా చేసింది.

గత ఏడాది డిసెంబర్‌లో తిస్సూర్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో కూడా నిర్వహించారు. ఆ తర్వాత సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు మరోసారి తిస్సూర్‌కు వచ్చారు ప్రధాని. అయితే జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పుడు కేరళలో బీజేపీ ఒక స్థానంలో గెలవడం దేశవ్యాప్తంగా కేరళవైపు చూసేలా చేసింది. మొదటిసారిగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సురేష్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ' ఏదైతే అసాధ్యమని అనుకున్నామే అదే ఇప్పుడు అద్భుతంగా సాధ్యమయ్యింది. ఇది కేవలం 62 రోజుల ఎన్నికల ప్రచారం వల్ల కాదు.. గత ఏడేళ్ల భావోద్వేగ ప్రయాణం వల్లే. నేను కేరళ కోసం పనిచేస్తాను. నా మొదటి ప్రాధాన్యం AIIMS కే ఉంటుందని' సురేష్ అన్నారు.

Also read: 2018 తర్వాత భారత ప్రధాని,రాష్ట్రపతి నెల జీతం ఎంతో తెలుసా?

#bjp #kerala #union-minister #suresh-gopi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe