Desi Markets Down Trending : అంతర్జాతీయ మార్కెట్ల(International Markets) లో ప్రతికూల సంకేతాలు దేశీ మార్కెట్ సూచీల మీద ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈరోజు అంటే మార్చి 26న స్టాక్ మార్కెట్(Stock Market) లో క్షీణత కనిపిస్తోంది. సెన్సెక్స్(Sensex) 211 పాయింట్లకు పైగా పతనంతో 72,620 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 47 పాయింట్లకు పైగా పడిపోయి, 22,049 స్థాయి వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.84 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 86 అమెరికన్ డాలర్ల దగ్గర ఉంది.
నిన్న సెలవు...
ఈరోజు దేశీ మార్కెట్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. పవర్ గ్రిడ్, మారుతీ, టైటన్, ఎన్‌టీపీపీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిసాయి. ఇదే ఈరోజే దేశీ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తోంది. మరోవైపు నిన్న హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు. అలాగే శుక్రవారం గుడ్‌ఫ్రైడే(Good Friday) కారణంగా ఆరోజు కూడా సెలవే. దీంతో నెలవారీ డెరిటివ్ కాంట్రాక్టుల గడువు గురవారమే అయిపోనుంది.
Also Read : Kejriwal : కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండోసారి ఆదేశాలు