CM Jagan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!

జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని సెటైర్లు వేశారు జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అని పేర్కొన్నారు.

New Update
CM Jagan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!

Barrelakka Better Than Pawan Kalyan: ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan). వైఎస్సార్ సుజ‌ల ధార డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ సమస్యల భారిన పడకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్ట్ ద్వారా శాశ్వత పరిష్కరం చూపించారు.

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు సీఎం జగన్ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఇవాళ ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు చేశారు. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రిని నిర్మించారు.

ALSO READ: BREAKING : ఐదుగురు లోక్‌సభ ఎంపీలు సస్పెన్షన్‌..!

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ పై (Pawan Kalyan) విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అని వ్యాఖ్యానించారు సీఎం జగన్. ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏమిచేసిన వీరికి ఏడుపే అని ఫైర్ అయ్యారు. వారిద్దరు హైదరాబాద్ లో ఉంటూ ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఏపీలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలో వీరు నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి నాన్ లోకల్ నాయకులతో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండలని ఆయన హెచ్చరించారు.

గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంనే పట్టించుకోలేదని అన్నారు. అలాంటిది ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ప్రేమ ఎలా ఉంటుందని చురకలు అంటించారు. చంద్రబాబు దత్తపుత్రుడికి తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదంటూ సెటైర్లు వేశారు.

ALSO READ: మస్క్ మామ మళ్ళీ ఏమో చేశాడు బ్రో.. రోబోను మనిషిని చేసేస్తాడా ఏమి?

Advertisment
తాజా కథనాలు