Delhi Liquor Scam: కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ..సుప్రీంకోర్టుకు ఆమ్ ఆద్మీ పార్టీ టీం.!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెర్చ్ వారెంట్ తో చేరుకున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా కేజ్రీవాల్ టీం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

New Update
Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్

Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ బృందం చేరుకోగానే, కేజ్రీవాల్ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా అధికారులను ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు ఇవాళ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ రూలింగ్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఈడీ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. 12 మంది ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరుపుతున్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

సెర్చ్ వారెంట్ తోనే వెళ్లిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు వచ్చిన తర్వాత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు సీఎం నివాసానికి వచ్చిన తీరు..ఇతరులను ఎవరినీలోపలికి అనుమతించని వైనాన్ని చూస్తే సోదాలు చేస్తున్నట్లు అర్థం అవుతుందని వివరించారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు.

దీంతో వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తక్షణమే తమ పిటిషన్ విచారనించాలని విజ్నప్తి చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ 9సార్లు సమన్లు పంపించింది. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

ఇది కూడా చదవండి:  ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అప్‌లోడ్ చేసిన ఈసీ

Advertisment
తాజా కథనాలు