సినిమా రేంజ్‌లో స్మగ్లింగ్.. కడుపులో రూ.15 కోట్ల కొకైన్

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 67 గుళికల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా నుంచి ఇండియాకు ఓ యువకుడు కడుపులో అక్రమంగా కొకైన్‌ను తరలిస్తున్న యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ కొకైన్ విలువ దాదాపుగా 14.94 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

New Update
dELHI DRUGS

dELHI DRUGS Photograph: (dELHI DRUGS)

ఎన్నో ప్లాన్‌లు వేసి అధికారులకు ఎవరికి కూడా చిక్కకుండా సినిమాల్లో స్మగ్లింగ్ చేస్తుంటారు. వీడొక్కడే సినిమాలో సూర్య స్నేహితుడు తినేసి కడుపులో డ్రగ్స్ సప్లై చేస్తాడు. ఇలాంటి ఘటనే తాజాగా న్యూఢిల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

ఇది కూడా చూడండి:Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

67 కొకైన్ గుళికలు..

ఇథియోపియా నుంచి వస్తున్న కెన్యా పౌరుడిని టెర్మినల్-3 వద్ద అధికారులు అనుమానంతో చెక్ చేశారు. మొదట అతను సాకులు చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత 67 కొకైన్ గుళికలను మింగినట్లు ఆ యువకుడు ఒప్పుకున్నాడు. అక్రమ రవాణా కోసం వాటిని ఇండియాకి తీసుకొస్తున్నట్లు ఆ యువకుడు తెలిపాడు. వెంటనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆసుపత్రికి పంపారు. 

ఇది కూడా చూడండి: Fake Gold: షాపు ఓనర్కు  మస్కా :  నకిలీ బంగారం తాకట్టు పెట్టి..  అసలు బంగారంతో పరార్!

వైద్యుల పరివేక్షణలో ఆ యువకుడి కడుపు నుంచి 67 గుళికలను తొలగించారు. మొత్తం అందులో 996 గ్రాముల హై-పూర్యిటీ కొకైన్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర దాదాపుగా రూ.14.94 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అక్రమంగా వీటిని రవాణా చేసినందుకు ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 21, 23, 29 కింద ఆ యువకుడిని అరెస్టు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కొకైన్‌ను సురక్షితంగా ఉంచారు.

ఇది కూడా చూడండి:Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు