India at UNSC:గాజాలో మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి-ఐరాసలో భారత్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయక , సామాన్య ప్రజలు మరణించడం మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించేందుకు ఇరు వర్గాలు మళ్ళీ చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థిలు మీద ఐరాస భద్రతా మండలిలో జరగిన చర్చలో ఇండియా ఈ వ్యాఖ్యలను చేసింది.

New Update
India at UNSC:గాజాలో మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి-ఐరాసలో భారత్

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం ద్విదేశ విధానానికి భారత్ ఎప్పుడూ మద్దతునిస్తుందని ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఉప శాశ్వత ప్రతినిధి ఆర్. రవీంద్ర అన్నారు. ఇరు వర్గాల దాడుల్లో పౌరుల మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించాలన్నారు. గాజాలో మనవతా సంక్షోభానికి తెర దించాలని రవీంద్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇజ్రాయెల్ భద్రతా సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

గాజాలో మానవతా సాయం అందించేందుకు ముందుకు వస్తున్న ప్రసంచ దేశాల పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. తమ దేశం తరుఫు నుంచి మందులు, నిత్యావసర వస్తువులు లాంటివి 38 టన్నుల సామాగ్రిని గాజాకు చేరవేశామని ఆర్. రవీంద్ర తెలిపారు. ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యం ద్వారా పాలస్తీనా ప్రజలకు ఇండియా ఎప్పుడూ మద్దతునిస్తూనే ఉంటుందని తెలిపారు.

మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మలిటెంట్లు లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడుల్లో 24 గంటల వ్యవధిలో 704 మంది చనిపోయారు. మొత్తం 400 వైమానికి దాడులను ఒక్క రోజులోనే నిర్వహించింది ఇజ్రాయెల్. బాంబు దాడులతో హమాస్ స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని చెప్పింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్లు కూడా చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే వారితో పాటూ సామాస్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొత్తం 704 మంది చనిపోగా అందులో 305 మంది చిన్నారులు, 137 మంది మహిళలు ఉన్నారు. నిన్న రాత్రి దక్షిణ గాజాలో ఖాన్ యూనిస్ సిటీలో బాంబు దాడిలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇందులో 32 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. వీరంతా ఉత్తర గాజా నుంచి వచ్చినవారే.

Advertisment
Advertisment
తాజా కథనాలు