Daggubati Purandeswari : ఆ పార్టీతో పొత్తు గ్యారెంటీ.. సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది: పురంధేశ్వరి

New Update
AP BJP: టీడీపీ బంద్‌కు మద్దతుపై సైబర్ క్రైమ్ పోలీసులకు పురందేశ్వరి ఫిర్యాదు

భారతీయ జనతా పార్టీ(BJP), జనసేనల(Janasena) పొత్తు గురించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే తమ లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందన్నారు.

బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. మిగిలిన పార్టీలతో పొత్తుపై కేంద్రం నిర్ణయిస్తుందని వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే.. అక్కడి నుంచే పోటీ చేస్తానని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో వైసీపీ ప్రభుత్వం(YCP GOVT.) చెప్పాలని డిమాండ్ చేశారు. తాను పార్టీ అధ్యక్షురాలిని అయ్యాక మొదట రాష్ట్రంలో పంచాయతీల అంశాన్ని తీసుకున్నానని అన్నారు. నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్‌ లు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరారని.. ఏపీ బీజేపీ వారికి పూర్తి మద్దతు అందిస్తుందని భరోసా కల్పించారు.

గోదావరి జిల్లాలకు, రాష్ట్రానికి కేంద్రం పలు సంస్థలు కేటాయించిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి సిద్థంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందని ఆరోపణలు చేశారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆవ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని.. మడ అడవులని నరికించేశారని పురంధేశ్వరి మండిపడ్డారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ పనులు నత్తనడకన సాగడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఏమాత్రం కేటాయించడం లేదని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన సర్పంచుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి.

Advertisment
Advertisment
తాజా కథనాలు