🔴Live News Updates: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
భూపేంద్రసింగ్ అనే వ్యక్తి సైబర్ స్కామర్‌నే బురిడీ కొట్టించి రూ.10వేలు ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీబీఐ ఆఫీసర్‌నంటూ కేటుగాడు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను బంగారం విడిపించాలని చెప్పి భూపేంద్ర తిరిగి రూ.10వేలు రాబట్టాడు.
తెలంగాణ జగిత్యాలలో హృదయవిదారక ఘటన జరిగింది. భర్త కమలాకర్‌ను భార్య జమున తమ ముగ్గురు పిల్లలు, అల్లుడితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపింది. కుటుంబకలహాలే కారణంగా గుర్తించిన పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేయించి ఐదుగురిని అరెస్ట్ చేశారు.
హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.
భయ్యా సన్నీ యాదవ్‌కు సంబంధించిన మరో వీడియోను వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ‘మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్‌కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా?‘‘ అని ఫైరయ్యారు.
హైదరాబాద్‌లో మరో భార్య మర్డర్ కలకలం రేపింది. అంబర్‌పేట మజీదు బస్తీలో కిరాణ షాపు నడుపుతున్న నవీన్.. తన భార్య రేఖ మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆమె చనిపోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు.
జడ్చెర్లలో ఓ మహిళ అల్లుడి వరుసైన యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో అందరికీ చెబుతానన్నాడు. దీంతో ప్రియుడితో కలిసి భార్య చున్నీతో భర్తను చంపేసింది. పోలీసులకు అనుమానం వచ్చి భార్యను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆమె బాడీలోని ప్రతి అంగంలో బంగారం దాచి స్మగ్లింగ్ చేసిందంటూ బీజాపూర్ ఎమ్మెల్యే బసనగౌడ దుమారం రేపాడు. ఇందులో భాగమైన మంత్రుల చిట్టా తన దగ్గర ఉందన్నాడు.
కర్ణాటకలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇది లవ్ జిహాద్ అని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ హత్యను ఖండిస్తూ రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.