/rtv/media/media_files/2025/03/17/a0L3zmFMDsZBCZ1dKKGV.jpg)
Hyderabad wife murder
Hyderabad: హైదరాబాద్‌లో మరో అక్రమ సంబంధం మర్డర్ సంచలనంగా మారింది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భార్య తనను మోసం చేసిందనే కోపంతో ఓ భర్త ఆ ఇళ్లాలిని సజీవదహనం చేశాడు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా ఆమెను లేపేశాడు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణం అంబర్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
షాపుకు వెళ్లగానే మరో పురుషుడితో..
ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ డి.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట పటేల్ నగర్ బిలాల్ మజీదు బస్తీకి చెందిన నవీన్ (32), రేఖ (28)కు 6 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. వీరికి కొడుకు (5), కూతురు (3) ఇద్దరు పిల్లలున్నారు. అయితే నవీన్ తన ఇంటికి దగ్గరలో ఓ కిరాణం షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె మరో పురుషుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించిన భర్త తాగుడుకు బానిసయ్యాడు. అనుక్షణం అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు.
Also Read : ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు భార్యాభర్తలకు సర్దిచెప్పి కాపురాన్ని నిలబెట్టారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా రేఖపై అనుమానం మాత్రం పోలేదు నవీన్‌కు. ఈ క్రమంలో మార్చి 10న రాత్రి మళ్లీ గొడవ జరిగింది. రేఖ తిరగబడటంతో ఆగ్రహానికి లోనైన నవీన్.. మద్యం మత్తులో భార్య రేఖపై తన బైక్‌లో ఉన్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాసేపటి మంటలు ఆర్పివేసి రేఖ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పాడు. వెంటనే వచ్చిన రేఖ పేరెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు నవీన్ పై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..