భర్త ఇంటికి రాడనుకుని అల్లుడితో అత్త సరసాలు.. చివరికి బిగ్ ట్విస్ట్ !

జడ్చెర్లలో ఓ మహిళ అల్లుడి వరుసైన యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో అందరికీ చెబుతానన్నాడు. దీంతో ప్రియుడితో కలిసి భార్య చున్నీతో భర్తను చంపేసింది. పోలీసులకు అనుమానం వచ్చి భార్యను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.

author-image
By Kusuma
New Update
Mahabhubnagar crime

Mahabhubnagar crime Photograph: (Mahabhubnagar crime)

ప్రస్తుతం రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. వీటివల్ల జాలి లేకుండా సొంత భర్తలను చంపేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రియుడు కోసం ఇటీవల ఓ భార్య ఏకంగా భర్తను చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో మినుగ కొండయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలుతో కలిసి ఉంటున్నాడు. అయితే అదే కాలనీలో రాజ్‌కుమార్(23) అనే యువకుడు ఉంటున్నాడు.

ఇది కూడా చూడండి:Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..

భార్య అలివేలుకి అల్లుడు వరుసయ్యే ఇతనితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిస్తే మందలించాడు. దీంతో భార్య అలివేలు భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. అయితే జనవరి నెలలో మినుగ కొండయ్య షాద్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. వచ్చేసారికి రాత్రి కావడంతో.. భార్య ఇంతలో వారి పాత ఇంటికి తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఇంతలో వచ్చిన కొండయ్య వారిని చూసి ఆగ్రహంతో కొట్టాడు. మిగతా వారికి కూడా చెబుతామని వారించడంతో భార్య అలివేలు ప్రియుడితో కలిసి చున్నీతో భర్తను చంపేసింది.

ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

ఏం తెలియనట్లు కొత్త ఇంటికి వెళ్లిపోయింది. కొండయ్య కనిపించడం లేదని సోదరుడు నాగయ్య పోలీసులుకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చి భార్యను విచారించగా నేరం అంగీకరించింది. తాజాగా పోలీసులు అలివేలుతో పాటు ప్రియుడు రాజ్‌కుమార్‌ను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇది కూడా చూడండి:Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

Advertisment
తాజా కథనాలు