/rtv/media/media_files/2025/05/20/ABlyBflj5qtavkkHYnuG.jpg)
సభ్యసమాజం తలదించుకునే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ తల్లి తనతో అక్రమసంబంధం పెట్టకున్న వ్యక్తి .. ఆమె కూతురిపై అత్యాచారం చేస్తుంటే సహకరించింది. ఈ ఘటనలో పాపం ఆ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిందనే చెప్పాలి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్వానీ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ మూడేళ్ల క్రితం గర్భిణిగా ఉన్న సమయంలో ఆమె భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు 19ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అనంతరం అది అక్రమ సంబంధానికి దారితీసింది.
Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు
అయితే గత ఆదివారం రాత్రి తన రెండున్నరేళ్ల కుమార్తెతో ఉన్న టైమ్ లో వారి ఇంటికి వచ్చిన యువకుడు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతటి దారుణాన్ని ఆపాల్సింది పోయి.. ఆమె తన ప్రియుడికి సహకరించింది. దీంతో కొద్దిసేపటికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే చిన్నారి మూర్ఛపోయి పడిపోయిందని తమపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మాల్వాణి జనకళ్యాణ్ నగర్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు వెల్లడించారు.
Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
ప్రైవేటు పార్ట్స్ పై గాయాలు
అయితే ఆమె ప్రైవేటు పార్ట్స్ పై గాయాలను గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తన కుమార్తెపై అత్యాచారం చేయడానికి అతడికి మహిళ సహకరించిందని.. బాలిక పరిస్థితి చేయి దాటిపోయినట్లు గమనించి వారు మూర్ఛ నాటకం ఆడారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సదరు మహిళ, యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. నిందితురాలిని రీనా షేక్ గా గుర్తించగా, టీనేజ్ వ్యక్తిని ఫర్హాన్ షేక్ గా గుర్తించారు. .
Also read : ఓరి మీ దుంప తెగ .. బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా.. ఎగబడి మరీ పట్టుకెళ్లారు! - VIral Video
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!