ఓరి మీ దుంప తెగ .. బీర్ బాటిళ్ల ట్రక్‌ బోల్తా.. ఎగబడి మరీ పట్టుకెళ్లారు! - VIral Video

బీరు బాటిళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో డ్రైవర్, క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని కాపాడి ఆసుపత్రికి తరలించాల్సింది పోయి మానవత్వం మరిచి దొరికినకాడికి బీరు బాటిళ్లు దోచుకెళ్లారు స్థానికులు.

New Update
Beer Bottles

Beer Bottles

బీరు బాటిళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో బీర్ బాటిళ్లన్నీ కింద పడిపోయాయి. డ్రైవర్, క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని కాపాడి ఆసుపత్రికి తరలించాల్సింది పోయి మానవత్వం మరిచి  దొరికినకాడికి బీరు బాటిళ్లు దోచుకెళ్లారు స్థానికులు. కొందరు చేతులతో అయితే మరికొందరు సంచుల్లో, భూజాలపై మరి మోసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.  కట్నిలోని చాపారా గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ మొత్తం సంఘటన వీడియో సీసీటీవీ ఫుటేజ్ లో  రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

గేదె అకస్మాత్తుగా రావడంతో 

ట్రక్కు జబల్పూర్ నుండి భోపాల్ లోని హజారీబాగ్ కు వెళుతుండగా..  ఒక గేదె అకస్మాత్తుగా దాని ముందుకి రావడంతో ట్రక్కు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గేదేను కాపాడే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తద్వారా వాహనం బోల్తా పడిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్‌కు సహాయం చేయడానికి బదులుగా కొంతమంది స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న బీరు బాటిళ్లను దోచుకెళ్లారు.  

లక్షల రూపాయల నష్టం

పోలీసులకు సమాచారం అందిన వెంటనే, సలీమ్నాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అఖిలేష్ దహియా నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను చికిత్స కోసం కట్ని జిల్లా ఆసుపత్రికి పంపారు. ఇంతలో, మిగిలిన మద్యంను భద్రపరచడానికి ఎక్సైజ్ శాఖ కూడా వచ్చింది. అయితే, అప్పటికి, స్థానికులు భారీ స్థాయిలోనే మొత్తాన్ని తీసుకెళ్లారు. ఈ ప్రమాదం, స్థానికుల దోపిడీ వల్ల లక్షల రూపాయల నష్టం జరిగిందని మద్యం కాంట్రాక్టర్ వాపోయాడు.  పోలీసులు కొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వైరల్ వీడియోలను ఉపయోగించి అనుమానితులను గుర్తించడానికి పని చేస్తున్నారు.  

 Beer Bottles | jabalpur | Madhya Pradesh | telugu-news | Viral Video

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు