Crime: దారుణం.. కన్న కొడుకు ముందే భర్తను హత్య చేసిన భార్య

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Wife Kills Husband

Wife Kills Husband

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య(wife-killed-husband) చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్‌ (35) అనే వ్యక్తికి మాధవి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కొడుకు ఉన్నాడు. అయితే కుమార్ ప్రతిరోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా రాత్రి తాగొచ్చి భార్యతో గొడవకు దిగాడు. భార్య మాధవి అతడిపై సహనం కోల్పోయింది. గోడవ పూర్తయ్యాక రాత్రికి భర్త నిద్రపోయాడు.

Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య

Wife Killed Husband

అర్ధరాత్రి సమయంలో మాధవి.. కొడుకు చూస్తుండగానే ఇంట్లో ఉన్న సిమెంట్‌ ఇటుకతో భర్త తలపై కొట్టింది. దీంతో కుమార్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని దగ్గర్లో కొత్తగా నిర్మిస్తున్న ఓ సంపులో పడేసి ఇంటికి వచ్చేసింది. విషయం తెలుసుకున్న కుమార్‌ సోదరుడు ఈ విషయం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాధవిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం.. సీఎం సంచలన కామెంట్స్

ఇదిలాఉండగా తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలో మరో దారుణ జరిగింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త వినోద్‌ తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. భార్యకు మరో వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో ఆరు నెలల క్రితం ఆమె తన భర్త, పిల్లలను వదిలేసి అతడితో వెళ్లిపోయింది. కొన్నిరోజుల క్రితమే వినోద్ ఆమెను కలిసి ఇంటికి రావాలన్నాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన వినోద్ శుక్రవారం పిల్లలకు స్వీట్లు ఇచ్చి తినిపించాడు. అవి వాళ్లు తింటుండగానే గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.   

Advertisment
తాజా కథనాలు