/rtv/media/media_files/2025/06/08/BivzLZ9DdklB5hggyIyu.jpg)
Husband second marriage for dowry
ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఇక్కడ ఒక వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ కట్నం కోసం దురాశతో మొదటి భార్యకు తెలియకుండా రెండో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
కానీ అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో.. ఆమె పెళ్లి మండపానికి వెళ్లి అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
కట్నం కోసం సెకండ్ మ్యారేజ్
చిక్కమగళూరు జిల్లా అరసికెరెలోని తిప్పఘట్టకు చెందిన కార్తీక్ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం తనూజ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే అతడికి కట్నం ఆశ ఎక్కువవడంతో కార్తీక్ మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో కర్ణాటకలోని చిత్రదుర్గలోని కోటేనాడులోని గాయత్రి కల్యాణ మంటపంలో మ్యారేజ్ సెట్ చేశాడు.
Chitradurga : 2ನೇ ಮದುವೆ ಆಗಲು ಹೊರಟ್ಟಿದ್ದ ಪತಿಗೆ ಪತ್ನಿಯಿಂದ ಧರ್ಮದೇಟು | 2nd Marriage Incident | Sanjevani News
— Sanjevani News (@sanjevaniNews) June 8, 2025
.
.
.
.
.#Sanjevani#SanjevaniNews#2ndMarriageIncident#Tanuja#Karthik#TanujaHusband#2ndMarriage#SriGayathriKalyanaMantapa#Chitradurgapic.twitter.com/4CzadUTZRs
ఈ విషయం మొదటి భార్యకు తెలిసిపోవడంతో ఆమె తన ఫ్యామిలీతో కల్యాణ మండపానికి వచ్చింది. అనంతరం తన భర్త కార్తీక్‌ను నిలదీసింది. అప్పటికీ అతడు వినకపోయేసరికి అందరి ముందే తన భర్త ముఖంపై చెప్పుతో కొట్టింది. అనంతరం ఆ పెళ్లిని ఆపింది. ఈ ఘటనపై ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.