Uttar Pradesh : టచ్ చేస్తే చచ్చిపోతా.. ఫస్ట్ నైట్ రోజే వరుడికి వధువు షాక్.. చివరికి బిగ్ ట్విస్ట్!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

author-image
By Kusuma
New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండిషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు