13ఏళ్ల స్టూడెంట్‌తో బిడ్డని కన్న టీచర్ అరెస్ట్.. ఎందుకంటే?

USAలోని న్యూజెర్సీ స్కూల్లో 5 క్లాస్ టీచర్ లారా కారన్ 13ఏళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించింది. ఊరెళ్తూ.. 2016 నుంచి 2020 మధ్య తల్లిదండ్రులు బాలుడిని ఆమె దగ్గర వదిలి వెళ్లారు. లారా మైనర్‌తో 2019లో ఓ బిడ్డని కూడా కన్నది. 2025 జనవరి 16న ఆమె అరెస్టైంది.

New Update
teacher usa

teacher usa Photograph: (teacher usa)

ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చేసిన పనికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలోని న్యూజెర్సీ ప్రైవరీ స్కూల్‌లో 5వ తరగతి ఉపాధ్యాయురాలు లారా కారన్ ఏం చేసిందే తెలిస్తే మీరు షాక్ అవుతారు. తల్లిదండ్రులు పని వేళ్తూ.. 5వ తరగతి చదివే వారి కొడుకుని 2016 నుంచి 2020 మధ్య కొన్నిరోజులు టీచర్ దగ్గర వదిలి వెళ్లారు. అతన్ని ఆ టీచర్ ఇంట్లోనే పెట్టుకుంది. పాఠాలు చెప్పటం పక్కన పెట్టి ఉపాద్యాయురాలు 13ఏళ్లు బాలుడితో లైంగిక వాంఛలు తీర్చుకుంది. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపింది ఈ గ్యాంగే

మైనర్ బాలుడికు 11 ఏళ్ల వయసు నుంచే లారా కారన్ అనుచిత లైంగిక సంబంధం పెట్టుకుంది. అంతేకాదు బాలుడిని లారా కారన్ లైంగికంగా వేధించి అతనితో ఆమె కోరికలు తీర్చుకుంది. టీచర్‌ లారా కారన్ గర్భందాల్చింది. 2019లో ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టింది. ఆ టైంలో టీచర్ వయసు 28ఏళ్లు కాగా, బాలుడికి 13ఏళ్లు. ఆమె బాలుడితో అనుచితమైన లైంగిక సంబంధం కొనసాగించింది. గుట్టుగా వారి ఇద్దరి మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది.

ప్రస్తుతం బాలుడికి 19ఏళ్లు.. టీచర్‌తో అతనికున్న రిలేషన్‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేశాడు. అంతేకాదు.. వారిద్ధరికీ ఓ పిల్లాడు కూడా పుట్టాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ అతని తండ్రి చూశాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు పోలీసులను ఆశ్రయించారు. మైనర్ బాలుడిని సెక్సువర్‌గా వాడుకున్నందకు, లైంగికంగా వేధించినందుకు అమెరికన్ పోలీసులు టీచర్‌పై కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు.

Also Read: ఇక ఫేక్ కాల్స్‌‌కు గుడ్‌బై.. ఈ కొత్త ఫీచర్‌తో ట్రూకాలర్ అవసరం లేదు

కేప్ మే కౌంటీ కోర్టులో ప్రాసిక్యూటర్ బాలుడి తల్లిదండ్రుల తరుపు వాదనలు వినిపించాడు. టీచర్ లారా కారన్‌ను 2025 జనవరి 16న పోలీసులు అరెస్ట్ చేశారు. పని మీద వెళ్తూ నమ్మి తమ కొడుకుని తన దగ్గర వదిలి వెళ్లినందుకు టీచర్ చేసిన పనిపై బాలుడి తల్లిదండ్రులు కోపంగా ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు