/rtv/media/media_files/2025/01/25/ldIpYgB86jHxBQ9SW6qX.jpg)
Pune concrete lorry overturn Two young women killed
Lorry Accident: రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్(Rash Driving), డ్రంకన్ డ్రైవ్(Drunk & Drive) కారణంగా అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లడం కారణంగా రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్నాయి. అదే సమయంలో తమ వాహనాన్ని కంట్రోల్ చేయలేక ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది.
ఇది కూడా చదవండి:ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
కాంక్రీట్ లారీ కింద నుజ్జు నుజ్జు
పూణేలో భారీ రోడ్డు ప్రమాదం(Pune Road Accident) జరిగింది. కాంక్రీట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదే సమయంలో ఆ పక్కనే స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులు (ఐటీ ఇంజనీర్లు) ఆ కాంక్రీట్ లారీ కింద పడి నుజ్జు నుజ్జయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
వీడియో ప్రకారం.. మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తిన్నగా వెళ్తున్న కాంక్రీట్ లారీ ఒక్కసారిగా రోడ్డు మళ్లించింది. అదే సమయంలో ఆ లారీ అదుపుతప్పి స్కూటీపై వెళ్తున్న వారిపై అమాంతంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది కూడా చదవండి:సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
పూణే లో అదుపు తప్పి బోల్తా కొట్టిన కాంక్రీట్ లారీ ఇద్దరు యువతులు (ఐటీ ఇంజనీర్లు )మృతి.#viralvideopic.twitter.com/c6ZewUR2S8
— Telangana Awaaz (@telanganaawaaz) January 25, 2025
హైదరాబాద్‌లో మరో ఘటన
తాజాగా అలాంటి సంఘటనే మరొకటి హైదరాబాద్‌లో జరిగింది. రోడ్డుపై బీభత్సం సృష్టించిన కారు.. ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం కాన్సర్ హాస్పిటల్ వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. రయ్ రయ్‌మంటూ రోడ్డుపై అదుపుతప్పి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి:అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు తమ వాహనం వదిలి అక్కడ నుంచి పరారయ్యారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై క్షతగాత్రులను సమీప హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా.. దాని యజమాని ఎవరు? అనే వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.