Kurnool Bus Fire Accident: కారణం 2 ప్రమాదాలు.. అసలు జరిగింది ఇదే!

కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు బయటకువస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగలూరు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

New Update
Why sleeper buses meet with accidents

Why sleeper buses meet with accidents

కర్నూలు బస్సు ప్రమాదం(Kurnool Bus Accident)లో విస్తుపోయే విషయాలు బయటకువస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు ప్రమాదం(Kaveri Bus Accident)లో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ బైక్ బస్సు కింద పడి మంటలు వ్యాపించాయి. ఆ మంటలు బస్సులో భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి. ఆ బైక్ ఎలా వచ్చింది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో బైక్ నడిపిన శివశంకర్ వెనుక కూర్చున్న అతని ఫ్రెండ్ ఎర్ర స్వామి పోలీసులకు వివరించాడు. ప్రమాద స్థలానికి 3 కి.మీ ముందు పెట్రోల్ బంక్‌లో శివశంకర్, ఎర్రస్వామి కలిసి బైక్‌పై ప్రయాణించిన సీసీఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎర్రస్వామిని విచారించారు. మొత్తం రెండు ప్రమాదాలు జరిగినట్లు ఎర్రిస్వామి తెలిపాడు. బస్సు స్పాట్‌కు రాకముందే శివశంకర్ ఢీవైడర్‌ని ఢీకొట్టి స్పాట్‌లో చనిపోయాడు. దీంతో రోడ్డుకు అడ్డంగా పడ్డ బైక్‌ను ఎర్ర స్వామి పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. Vకావేరి బస్సు తొసుకెళ్లిందని-- శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి చెప్పాడు. ఈ ప్రమాదంలో ఎర్రిస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఎర్రిస్వామి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  మరో బస్సు ప్రమాదం..స్పాట్‌లో 45 మంది..

Kurnool Bus Fire Accident

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద, నేషనల్ హైవే 44పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. కానీ.. బస్సు స్పాట్‌కు రాకముందే అక్కడ బైక్ యాక్సిడెంట్ జరిగిందని బైక్‌ నడిపిన శివశంకర్ ఫ్రెండ్ ఎర్రస్వామి పోలీసులకు చెప్పాడు. బస్సు డ్రైవర్ కూడా విచారణలో ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. రోడ్డుపై పడిఉన్న బైక్‌ మీదుగా బస్సు వెళ్లింది. బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కిపోయి స్పార్క్ రావడం ప్రారంభమైంది. అది గమనించని బస్సు డ్రైవర్ అలాగే కొంత దూరం బస్సు నడిపాడు. దీంతో ఆ మంటలు బస్సుకు అంటుకొని నెమ్మదిగా బస్సు లోపల కమ్ముకున్నాయి. అలా ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారు మంటలు గుర్తించే సరికి అవి రెండు డోర్స్‌తోపాటు టైర్స్ చుట్టుముట్టాయి. డోర్స్ ఓపెన్ చేసే వైరింగి పూర్తిగా కాలిపోయింది. అలా బస్సులో ఉన్న వారంతా అందులోనే చిక్కుకున్నారు. అర్థ రాత్రి కావడంతో ప్రయాణీకులు ఘాడ నిద్రలో ఉన్నారు. క్షణాల్లోనే బస్సు అంతా పొగలు, మంటలు అలుముకున్నాయి. అగ్ని ప్రమాదం తీవ్రతరం కాకముందు బయట నుంచి కొందరు వ్యక్తులు డ్రైవర్ సీటు వెనుక ఉన్న విండో అద్దాలు ధ్వంసం చేశారు.  అందులో నుంచి కొందరు బయటకు వచ్చారు.--

Also Read :  ఘోర ప్రమాదం జరిగినా.. అదే నిర్లక్ష్యం..వీడియో చూస్తే చమటలు పట్టడం ఖాయం

Advertisment
తాజా కథనాలు