Private Bus Driver: ఘోర ప్రమాదం జరిగినా.. అదే నిర్లక్ష్యం..వీడియో చూస్తే చమటలు పట్టడం ఖాయం

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటికీ ఇంకా ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం వీడడం లేదు. ఇష్ట రీతిన బస్సు నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది.

New Update
private travels driver reckless driving viral video SMR

private travels driver reckless driving

Private Bus Driver: కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు మంటలంటుకుని 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ పైనా, డ్రైవర్ల నిర్లక్షం పైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన జరిగినప్పటికీ ఇంకా ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం వీడడం లేదు. ఇష్ట రీతిన బస్సు నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది. ఓ డ్రైవర్..బస్సును ఎంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న విషయం వెలుగు చూసింది. బస్సు ఎక్కాలంటేనే భయపడేలా అతను  డ్రైవ్ చేసిన తీరు అందిరికీ చమటలు పట్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్‌'కు కళ్లు చెదిరేలా హైదరాబాద్‌ బుకింగ్స్..!

ఆ వీడియో ప్రకారం.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్.. ఎంతో నిర్లక్ష్యంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో సదరు డ్రైవర్.. బస్సును రహదారిపై వెళ్తున్న లారీల మధ్యలోనుంచి వేగంగా నడుపుతున్న తీరు అందరిని భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో ఓ లారీకి అతి సమీపంలో నుంచి బస్సును క్రాస్ చేసిన తీరు ఒళ్లు జలదరించేలా చేస్తోంది. ఒక రకంగా తృటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పచ్చు.  అయితే ఆ బస్సు వెనుక వస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, వాటి డ్రైవర్లు అంతా నిర్లక్ష్యంగా నడపడం వల్ల హైవేలపై జరుగుతున్న ప్రమాదాలను ఆ వ్యక్తి ప్రస్థావించారు. ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలను గాల్లో కలిసిపోతున్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటూ ఆ అతను వీడియోను పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!

ఇలాంటి డ్రైవర్ల వల్లే .. ఎన్నో కుటుంబాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు స్పీడ్ లిమిట్ పెట్టకుంటే కర్నూలు ప్రమాదం లాగే మరిన్ని  ఘోరాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు బస్సుల డ్రైవర్లపై  ప్రయాణికులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. వారు చాలా నిర్లక్ష్యంగా బస్సులను డ్రైవ్ చేస్తుంటారని, కొన్నిసార్లు తమ గమ్యం చేరేవరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ పట్ల ప్రభుత్వాలు కఠినంగా ఉండాలని కోరుతున్నారు.

Also Read: Allu Arjun: మైండ్ బ్లోయింగ్ .. రిషబ్ శెట్టి 'కాంతారా' ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్! పోస్ట్ వైరల్

Advertisment
తాజా కథనాలు