Crime: వరంగల్ లో విషాదం.. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు నాన్న చూశాడని... భయంతో బాలిక సూసైడ్!

హనుమకొండ నగరంలోని గోపాల్‌పూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి భరత్ అనే యువకుడు వచ్చాడు.కూతురుతో యువకుడిని చూసి తండ్రి ఆ యువకుడికి దేహశుద్ది చేశాడు.దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది

New Update
women Murder

women Murder

ఇంట్లో ప్రియుడి (Lover) తో కలిసి ఉండగా తండ్రి కంటబడటం, ఆపై జరిగిన గొడవతో అవమానం భారం తాళలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని (Intermediate Student) బలవన్మరణానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా కేయూ పోలీస్‌స్టేషన్‌ పరిధి గోపాల్‌పూర్‌లో  ఈ ఘటన జరిగింది. గోపాల్‌పూర్‌కు చెందిన ఓ బాలిక సుబేదారిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఆ బాలిక తల్లిదండ్రులు ప్రైవేటు ఉద్యోగులు. ఇంటర్‌ ఫస్టియిర్‌ చదువుతున్న సమయంలో ఓ సీనియర్‌ విద్యార్థితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

Also Read: Komatireddy Vs KTR: కేటీఆర్ ఓ బచ్చా.. నా కాలి గోటికి కూడా సరిపోడు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

పోచమ్మ మైదాన్‌కు చెందిన సదరు యువకుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్‌ ఫస్టియిర్‌ చదువుతున్నాడు. ఇటీవల స్వస్థలానికి వచ్చాడు. అయితే, బాలిక తల్లిదండ్రులు ఎప్పటిల్లానే మంగళవారం ఉదయం విధులకు వెళ్లిపోగా.. ఆ బాలిక కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యా హ్న సమయంలో ఆమెను కలిసేందుకు ప్రియుడు ఇంటికి వచ్చాడు. కాగా అదే సమయంలో బాలిక తండ్రి కూడా మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చా డు. తండ్రి రాకతో బాలిక తన ప్రియుడ్ని ఇంట్లోని ఓ గదిలో దాచేసింది. 

Also Read: వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం!

Intermediate Student Suicide

భోజనం అనంతరం తండ్రి తిరిగి విధులకు వెళ్లిపోగా.. వారి పక్కంటిలో ఉండే బాలిక మేనమామ అనుమానంతో బాలిక తండ్రికి ఫోన్‌ చేసి మళ్లీ వెనక్కి పిలిపించాడు. తండ్రి ఇంటి తలుపు కొట్టగా.. ఎవరో అనుకుని బాలిక తలుపులు తీయగా ఇంట్లోకి ప్రవేశించిన తండ్రికి ఆ యువకుడు కనిపించాడు. దీంతో ఆ యువకుడు పారిపోయేందుకు యత్నించగా బాలిక తండ్రి, మేనమామ పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అవమాన భారంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. 

అయితే, ఆ ఇంటి సమీపంలో నివసించే ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ అక్కడికి చేరుకుని బాలికను కిందికి దించి సీపీఆర్‌ చేసి బతికించేందుకు యత్నించాడు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే బాలిక మరణించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. 

అప్పటికే సదరు యువకుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుండగా.. అతడి గొంతుకు కత్తి గాట్లున్నాయని, బాలిక కుటుంబసభ్యులు అతడిని చంపేందుకు ప్రయత్నించారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ఘటనపై రాత్రి 10:30గంటల వరకు ఎలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని పోలీసులు తెలిపారు.

Also Read:Maha Kumbh Mela: భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Also Read:Hyderabad Metro: హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు.. ఎంతమంది చిక్కుకుపోయారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు