భారత్‌కు ట్రంప్ వినాయక చవితి బంపరాఫర్.. ఆ ఒక్క పని చేస్తే 25 శాతమే సుంకాలు

అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇండియాపై టారిఫ్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. అమెరికా చెప్పినట్లు చేస్తే వినాయక చవితి వేళ భారత్‌పై టారిఫ్‌లు తగ్గిస్తామని పీటర్ నవారో ప్రకటించారు.

New Update
Peter Navarro

Peter Navarro

అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇండియాపై టారిఫ్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. అమెరికా చెప్పినట్లు చేస్తే వినాయక చవితి వేళ భారత్‌పై టారిఫ్‌లు తగ్గిస్తామని పీటర్ నవారో ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన, ఈ యుద్ధానికి భారతే ప్రధాన కారణమంటూ 'మోదీ యుద్ధం' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే ఇండియాపై సుంకాలు 25శాతానికి తగ్గిస్తామని ఆయన అన్నారు.

భారత్ - క్రెమ్లిన్ లాండ్రోమాట్'

భారతదేశం రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురును కొనుగోలు చేసి, దాన్ని శుద్ధి చేసి యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు అధిక ధరలకు అమ్ముతోందని నవారో ఆరోపించారు. ఈ లాభాలు రష్యాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని, ఆ డబ్బును రష్యా తన ఆయుధాల తయారీకి, యుద్ధాన్ని కొనసాగించడానికి ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్ ఈ విధంగా క్రెమ్లిన్‌కు 'లాండ్రోమాట్'గా వ్యవహరిస్తోందని, అంటే మనీ లాండరింగ్ చేస్తున్నట్లుగా ఆరోపించారు.

నవారో ఆయన వాదనను సమర్థించుకుంటూ, అమెరికా భారత్ పై విధించిన 50 శాతం అదనపు సుంకాలను కూడా దీనికి ముడిపెట్టారు. భారత్ రష్యా నుంచి చమురు కొనడం మానేస్తే, ఆ సుంకాలలో 25 శాతం తగ్గింపు ఇస్తామని ప్రకటించారు. భారత్ తన వ్యాపార ప్రయోజనాలను పక్కనపెట్టి ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాతో వాణిజ్యం ఆపేయాలని ఆయన పరోక్షంగా సూచించారు.

వింత వాదనకు కారణాలు

చైనా, యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నప్పటికీ, కేవలం భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడం గమనార్హం. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా స్పందిస్తూ, ఈ వాదన అర్థం లేనిదని, భారత్ తన ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. నవారో వ్యాఖ్యలు కేవలం వాణిజ్య పరమైన ఒత్తిడిలో భాగంగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ పరిపాలనలో భారత్ పై ఒత్తిడి పెంచి, అమెరికాకు అనుకూలంగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడమే నవారో లక్ష్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు