/rtv/media/media_files/2025/04/20/y5NVdZ8ZZSvYN96KaCV6.jpg)
Tirumala Ghat roads
తిరుమల ఘాట్ రోడ్లపై ఎక్కువగా ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి మొదటి ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ టెంపో ట్రావెలర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
రెండో ఘాట్ రోడ్డులో కూడా..
దీంతో టెంపోలో ఉన్న పదిమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి కనీసం రోజు కాకుండానే ఆదివారం ఉదయం రెండో ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు
ఇదిలా ఉండగా తిరుమలలో రద్దీ కూడా భారీగా పెరిగింది. వేసవి సెలవులు రావడంతో పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ పరీక్షల ఫలితాల విడుదల కావడంతో పాటు, పైగా వరుస సెలవులు కూడా రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. గదుల కోసం భక్తులు రెండు మూడు గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్యాణ కట్టలతో పాటు శ్రీవారి ఆలయ ప్రాంతం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం ప్రాంతాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది.