Crime: తెలంగాణలో దసరా వేళ విషాదం.. ముగ్గురు మృతి

దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Drowning

Drowning

దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. చందంపేట మండలం దేవరచర్లలో పండుగ కోసమని ఓ ఇంటికి బంధువులు వచ్చారు. సరదాగా దగ్గర్లో ఉన్న వాగులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ 9 ఏళ్ల బాలుడు వాగులో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు యువకులు యత్నించారు. చివరికి వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: క్యాప్సికం పంటతో లాభాల వరద.. ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న 25ఏళ్ల యువతి

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాలు బయటికి తీశారు. మృతులు 9 ఏళ్ల ఉమాకాంత్, రాము (30), భరత్‌ కుమార్‌(9)గా గుర్తించారు. వీళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి ప్రాంతానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. కొడుకుల మృతితో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: ఎంతకు తెగించార్రా.. నకిలీ QR కోడ్ స్కామ్..పెట్రోల్ బంకులే టార్గెట్ !

ఇదిలాఉండగా తమిళనాడులో కూడా పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమవ్వడం కలకలం రేపింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ సందర్భంగా ఓ అయిదుగురు యువకులు చెన్నై నుంచి మన్నార్‌ ట్రిప్‌కు కారులో వెళ్తుండగా విల్లుపురం వద్ద వాళ్ల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగి ముగ్గురు యవకులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడగా వాళ్లని ఆస్పత్రికి తరలించారు. 

Advertisment
తాజా కథనాలు