/rtv/media/media_files/2025/08/31/woman-family-beats-man-2025-08-31-06-59-22.jpg)
Woman Family Beats Man
మనుసుపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్లాడు.. కానీ పిల్లనిస్తామని పిలిచి దాడికి చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి పిలిచి, 26 ఏళ్ల యువకుడిని వధువు కుటుంబం కొట్టి చంపిన సంఘటన మహారాష్ట్రలోని పింప్రి-చిన్చ్‌వాడ్‌లో జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో యువతి తండ్రి కూడా ఉన్నాడు.
మృతుడు రామేశ్వర్ ఘెంఘాట్ ఓ యువతిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. దీంతో మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని కాకుండా రెండు ఫ్యామిలీలను ఒక్కటవుదామనుకున్నారు. రామేశ్వర్ ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పారు. కానీ అమ్మాయి వాళ్ల ఫ్యామిలీకి అతని బ్యాగ్రౌండ్ నచ్చలేదు. రామేశ్వర్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోక్సో చట్టం కింద కేసులు కూడా ఉండటంతో అతడితో పెళ్లికి యువతి కుటుంబం అంగీకరించలేదు. అయినా, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో, యువతి కుటుంబం చర్చల కోసం రామేశ్వర్‌ను అతని తల్లిదండ్రులతో కలిసి తమ ఇంటికి పిలిచింది.
Called To Discuss Marriage Proposal, Woman's Family Beats Man, 26, To Death https://t.co/886REgyBaspic.twitter.com/XqHRNT1SzY
— NDTV (@ndtv) August 30, 2025
చర్చల సమయంలో ఘర్షణ చెలరేగడంతో, యువతి తండ్రి ప్రశాంత్ సర్సార్‌తో పాటు మిగతా నిందితులు యువకుడిని ఓ గదిలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలైన రామేశ్వర్‌ను ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతి తండ్రి ప్రశాంత్ సర్సార్‌తో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన సమాజంలో పరువు హత్యలు, ప్రేమ వివాహాల పట్ల కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఎంతగా ఉన్నాయో మరోసారి రుజువు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరాలని పోలీసులు తెలిపారు. రామేశ్వర్ కుటుంబ విషాదంలో మునిగిపోయింది.