BIG BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం.. ఒక్కొక్కరికి ఎంతంటే!

ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పారు.

New Update
CM Revanth

CM Revanth

BIG BREAKING: ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు విక్రమార్క చెప్పారు. భట్టితోపాటు మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌ ఉస్మానియాకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

ఏసీ వల్ల కాదు షార్ట్ సర్క్యూటే..

ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌ అని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదని, షార్ట్స్ సర్క్యూటే కారణం అని స్పష్టం చేశారు. స్థానికంగా పని చేసేవారు రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారని తెలిపారు. ఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవని, ఈ బిల్డింగ్ జీప్లస్ 2 కానీ బయటకు జీప్లస్ 1లాగా కనిపిస్తోందన్నారు.  ప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాతది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగింది. 

Also Read: రాకెట్‌ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?

ఫస్ట్ ఫోర్ల్, సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియా ఉందని, గ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారు. దీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేకపోయిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకోవడం వల్ల రెస్యూఆపరేషన్ కష్టంగా మారిందన్నారు. 

మోదీ దిగ్రాంతి..

హైదరాబాద్‌ చార్మినార్ గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ తెలిపారు. 

ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరగా క్షతగాత్రులు కోలుకోవాలని కోరుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు