TG Bus Accident: తెలంగాణలో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు.. 30 మంది ప్రాణాలు కాపాడిన టీ బ్రేక్.. అసలేమైందంటే?

హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇంజన్‌లో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

New Update
Fires

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాండూరులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరో బస్సు యాక్సిడెంట్ ప్రయాణికులను భయపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సులో చిట్యాల మండలం వెలిమినేడు వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో ఇంజన్‌లో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు.

ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: బాంబ్ బ్లాస్ట్‌పై తొలిసారి స్పందించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ - షాకింగ్ విషయాలు వెల్లడి

ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఉగ్రమూకలకు టార్గెట్ ఢిల్లీ.. 7సార్లు బ్లాస్.. 140 మందికి పైగా మృతి..!

డ్రైవర్ అప్రమత్తం కావడంతో..

బస్సు వెనుక అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు సురక్షితంగా తరలించారు. అయితే టీ బ్రేక్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే బస్సులో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. అదే టీ బ్రేక్ కాకపోయి ఉంటే.. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండేవారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని ప్రయాణికులు అంటున్నారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

Advertisment
తాజా కథనాలు