Delhi Bomb Blast: ఉగ్రమూకలకు టార్గెట్ ఢిల్లీ.. 7సార్లు బ్లాస్.. 140 మందికి పైగా మృతి..!

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఇవాళ ఘోరమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఢిల్లీలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్‌లు ఇప్పటి వరకు చాలానే జరిగాయి.

New Update
Delhi Bomb Blast 1996-2025

Delhi Bomb Blast 1996-2025

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఇవాళ ఘోరమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఢిల్లీలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్‌లు ఇప్పటి వరకు చాలానే జరిగాయి. 1996 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 7సార్లు పేలుళ్లు జరిగి 140 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. 

 1996 మే 21

1996 మే 21న ఢిల్లీలోని లజపత్ నగర్‌ సెంట్రల్ మార్కెట్‌లో దారుణమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో దాదాపు 13 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

1997 అక్టోబర్ - నవంబర్

1997 అక్టోబర్ 18, 26, 30న వరుసగా మూడు ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రాణీబాగ్, కరోల్ బాగ్, పంజాబీ బాగ్ ప్రాంతాలలో వరుస పేలుళ్లు జరగ్గా.. దాదాపు 6గురికి పైగా మృతి చెందారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆ మరుసటి నెల నవంబర్ 30న ఎర్రకోట ప్రాంతంలో మరో బ్లాస్ట్ జరిగింది. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గాయపడ్డారు.

2000 జూన్ 18

2000 జూన్ 18న ఎర్రకోట సమీపంలో రెండు భారీ బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. ఈ బ్లాస్ట్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8ఏళ్ల చిన్నారి కూడా ఉంది. 

2005 అక్టోబర్ 29

2005 అక్టోబర్ 29 దీపావళికి రెండు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలోని పహార్‌గంజ్ మార్కెట్, గోవింద్‌పురి నగర్‌, సరోజిని మార్కెట్‌లలో భారీ బ్లాస్ట్ జరిగి 62 మందికి పైగా మరణించారు. ఈ బ్లాస్ట్‌లో సుమారు 210 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

2008 సెప్టెంబర్ 13

2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కరోల్ బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్-1 వంటి ప్రధాన మార్కెట్లలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇందులో 25 నుండి 30 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

2011 సెప్టెంబర్ 7 

2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు గేట్ నంబర్ 5 బయట మరో భారీ పేలుడు సంభవించింది. ఇందులో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 79 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

ఇలా ఇవాళ్టి బాంబ్ బ్లాస్ట్‌తో కలిపి ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన ఘటనల్లో మొత్తం 140 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు.

Advertisment
తాజా కథనాలు