Delhi Bomb Blast: బాంబ్ బ్లాస్ట్‌పై తొలిసారి స్పందించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ - షాకింగ్ విషయాలు వెల్లడి

దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో జరిగిన ఒక్క బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
Delhi Bomb Blast

Delhi Bomb Blast

దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో జరిగిన ఒక్క బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని LNJP ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే విషయాలను ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు. 

పోలీస్ కమిషనర్ ప్రకారం..

‘‘ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతోంది. ఇది సాధారణ పేలుడు కాదు. ఈరోజు సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో ఈ బ్లాస్ట్ జరిగింది. ఒక కారు నెమ్మదిగా కదులుతూ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. అదే కారు పేలిపోయింది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. 

అన్ని ఏజెన్సీలు, FSL, NIA సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఈ సంఘటనలో కొంతమంది మరణించారు.. కొందరు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. హోంమంత్రి కూడా మాకు ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు ఆయనతో సమాచారం పంచుకుంటున్నాం.’’ అని చెప్పుకొచ్చారు. 

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. 

ఈ బాంబ్ బ్లాస్ట్ భారీగా ఉండటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ‘‘కారు క్షణంలో పేలిపోయింది. దీంతో మంటలు వేగంగా సమీపంలోని ఏడు నుండి ఎనిమిది వాహనాలకు అంటుకున్నాయి. పేలుడు తర్వాత ఢిల్లీ పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.’’ అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు