Tamil Nadu: పట్టుకున్న చేపే ప్రాణాలు తీసింది...తమిళనాడులో దారుణం!

బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకుని అది లోపలకి జారిపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అతన్ని వెంటనే ఆసుపత్రిగా తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడిని అరయపక్కం గ్రామానికి చెందిన మణిగందన్ గా గుర్తించారు.

New Update
fish tamil nadu

fish tamil nadu

Tamil Nadu: బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకుని అది లోపలకి జారిపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.  చెంగల్పట్టు జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి మంగళవారం మధురాంతకం ప్రాంతం సమీపంలో చేపలు పడుతుండగా బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకోవడంతో అది నోటీలోకి వెళ్లింది. దీంతో ఊపిరాడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  మృతుడిని అరయపక్కం గ్రామానికి చెందిన మణిగందన్ గా గుర్తించారు. స్థానికంగా రోజువారీ కూలీగా పనిచేసే అతనికి చేతులతో చేపలు పట్టే అలవాటు ఉంది.  

Also Read: Love jihad : లవ్ జిహాద్.. బయటకు ఈడ్చుకొచ్చి ఊతికారేసిన బీజేపీ మహిళా లీడర్!

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

తప్పించుకోకుండా ఉండటానికి

అతను చేపల కోసం తక్కువ నీటి మట్టాలు ఉన్న కీళవలం సరస్సు వద్దకు మంగళవారం వెళ్ళాడు. అయితే ముందుగా మణిగందన్ ఒక చేపను పట్టుకున్నాడు. అయితే మరొక చేపను చూసిన మణిగందన్‌ అది తప్పించుకోకుండా ఉండటానికి మొదటిదాన్ని తన నోటిలో పెట్టుకున్నాడు. అయితే బతికి ఉన్న ఆ చేప అతని గొంతులోకి లోతుగా వెళ్లిపోయింది.  అతని చుట్టూ ఉన్నవారు  వెంటనే మణిగందన్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే మణిగందన్‌ మృతి చెందినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. మణిగందన్‌ మృతదేహాన్ని కాయంకుళం తాలూకా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Uttar Pradesh : భార్యకు దగ్గరుండి ప్రియుడికిచ్చి రెండో పెళ్లి చేసిన భర్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు