/rtv/media/media_files/2025/04/10/3RSPopYtIlaPsK7ZlCzx.jpg)
marriage lover
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో కట్టుకున్న భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొక ఘటన జరిగింది. రాహుల్ సింగ్ (25)అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవి(23)తో వివాహం జరిగింది. అయితే అప్పటికే వైష్ణవి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీంతో భర్తతో రెండేళ్ల పాటు వైష్ణవి దూరంగా ఉంది. రాహుల్ ఆమెను తిరిగి రావాలని చాలాసార్లు ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ ఆమె నిరాకరిస్తూనే వచ్చింది. దీంతో తన భార్యకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. వారి ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోగా, భర్తే తన భార్యకు దగ్గరుండి రెండో వివాహం జరిపించాడు. ఒక న్యాయవాది సహాయంతో స్థానిక తహసీల్ కార్యాలయంలో వైష్ణవి, మనోజ్‌ల పెళ్లిని జరిపించాడు.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
🚨Farrukhabad Shocker🚨
— TheOpenFeed by Aditi (@The_Open_Feed) April 9, 2025
Husband Gets Wife Married to Her Lover! 💍😲
In an unexpected twist, a man from Farrukhabad helped his wife marry her lover after discovering their two-year marriage was overshadowed by her ongoing affair. Instead of conflict, he chose peace and safety pic.twitter.com/l2sVe07IOI
Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. కతర్ జోట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు - ఆర్యన్ (7), శివాని (2) జన్మించారు. పనిపనుల కారణంగా బబ్లూ తరచుగా బయట ప్రదేశాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో రాధికకు స్థానిక యువకుడైన వికాస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత బబ్లూకు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత బబ్లూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. తాను ఎలాగూ తన భార్యకు సమయం కేటాయించలేకపోతున్నానని.. తన భార్య ఇష్టపడిన వ్యక్తితోనే ఇచ్చి రెండో పెళ్లి చేశాడు.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?