భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు.

New Update
rajitha-shiva

rajitha-shiva

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. మీన్​పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్​లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్​(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. 

గెట్ టు గెదర్ పార్టీలో శివతో పరిచయం 

అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం,ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో, ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. ఇందుకోసం తననుపెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపొజల్ పెట్టింది. ఒకవేళ నీకుపెళ్లి కాకపోయి, పిల్లలు లేకుండా ఉంటే.. కచ్చి తంగా తానుపెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలిగించుకుని ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కె్చ్ వేసింది. 2025 మార్చి 27న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పింది రజిత. ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు శివ. 

ప్లాన్ లో భాగంగా పెరుగులో విషం

ప్లాన్ లో భాగంగా రజిత పెరుగులో విషం కలిపింది. పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది.  భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే అన్న తిని ఫోన్ రావడంతో పనికోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగాఉందంటూ నాటకం ఆడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు చెన్నయ్య .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ఆమె ప్రియుడు శివను  కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Also Read : HYD: పథకం ప్రకారమే జర్మన్ యువతిపై అత్యాచారం..దర్యాప్తు కీలక విషయాలు
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు